Telangana Group-4 Merit List Release After DASARA -TS Group 4 Latest Update

TS Group-4: దసరా తరువాత గ్రూప్‌-4 మెరిట్‌ జాబితా
* ఎన్నికల కోడ్‌ అనంతరం 1:2 నిష్పత్తి ప్రకారం తుది ఎంపిక

రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 సర్వీసుల పోస్టుల జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాను వెలువరించేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమైంది. జులై 1న రాతపరీక్ష నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా 7.6 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. దీనికి సంబంధించి తుది కీ వెల్లడించిన కమిషన్‌ పేపర్‌-1లో ఏడు ప్రశ్నలు, పేపర్‌-2లో మూడు కలిపి మొత్తం పది ప్రశ్నలు తొలగించింది. రెండు పేపర్లలో మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేయగా, ఇందులో అయిదింటికి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా పేర్కొంది. తుది కీ వెల్లడి కావడంతో అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిచేసింది. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితా వెల్లడించాలని కమిషన్‌ భావిస్తోంది. పరీక్ష రాసిన అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలు, జిల్లా స్థానికత, కేటగిరీ తదితర వివరాలు ఈ జాబితాలో ఉండనున్నాయి. దసరా పండగ తరువాత మెరిట్‌ జాబితా ఇవ్వాలని కమిషన్‌ భావిస్తోంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టతనిచ్చాక.. ఎన్నికల కోడ్‌ అనంతరం 1:2 నిష్పత్తి ప్రకారం తుది ఎంపిక జాబితాలు ప్రకటించనుంది.
Previous Post Next Post