Psychology - Definitions మనోవిజ్ఞాన శాస్త్ర కొన్ని నిర్వచనాలు

Psychology - Definitions మనోవిజ్ఞాన శాస్త్ర కొన్ని నిర్వచనాలు కొన్ని నిర్వచనాలు 


Psychology - Definitions మనోవిజ్ఞాన శాస్త్ర కొన్ని నిర్వచనాలు

1. ఆర్థర్ గేట్స్ (Arthur Gates) ప్రకారం 'మనోవిజ్ఞానం జీవరాసుల ప్రవర్తనను వివరించే సాధారణ సూత్రాలను కనుక్కునే శాస్త్రం'.

2. ఎడ్విన్. జి. బోరింగ్ (Edwin.G.Boring) ప్రకారం  'మానవ స్వభావాన్ని గూర్చి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞానం'..

3. నార్మన్.ఎల్.మన్ (Norman.L.Munn) ప్రకారం 'జీవుల బాహ్య అనుభవాలనే కాక అంతర్గత ప్రక్రియలను కూడ అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞానం'.

4. కెన్నెత్ క్లార్క్ (Kenneth Clark) ప్రకారం 'మనోవిజ్ఞానం మానవుల ప్రవర్తనా ప్రక్రియలైన ఇంగితాలు, భాష, శారీరక మార్పులేగాక ఆలోచనలు, స్వప్నాలు మొదలైన అంశాలను అధ్యయనం చేసే శాస్త్రం'.

5. 'మానవుని ప్రవర్తనను, ఇతరులతో అతనికి గల సంబంధాలను గూర్చి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞానం' అని క్రో అండ్ క్రో (Crow and Crow)లు నిర్వచించారు.

6. జె.బి. వాట్సన్(J.B. Watson) ప్రకారం మనోవిజ్ఞానం అన్నిరకాల ప్రవర్తనలను అధ్యయనం చేసే శాస్త్రంగా పేర్కొన్నారు

7.విలియం జేమ్స్, విల్‌హామ్ ఊంట్ అనే శాస్త్రజ్ఞులు ప్రకారం 'మనో విజ్ఞానం' మనస్సులోని చేతనత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రంగా నిర్వచించారు

పై నిర్వచనాలను పురస్కరించుకొని మనోవిజ్ఞానశాస్త్రం 'జీవరాసులలోని వ్యక్త అవ్యక్త ప్రవర్తనలను, వైయక్తిక సాంఘిక ప్రవర్తనలను, సామాన్య అపసామాన్య ప్రవర్తనలను' అధ్యయనం చేసే శాస్త్రంగా నిర్వచించుకోవచ్చు.
మానవుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రం మనోవిజ్ఞానశాస్త్రం అని నిర్వచించాము. ఇప్పుడు ప్రవర్తన అంటే ఏమిటో తెలుసుకోవాలి. ప్రవర్తన అంతర్గతమైంది కావచ్చు. ఉదాహరణకు ఆలోచించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం, మరచి పోవడం, ఊహించడం మొదలైనవి. ప్రదర్శన బహిర్గతమైంది కావచ్చు.
ఉదా: గీయడం, రాయడం, పాడటం, మాట్లాడటం, పరుగెత్తడం, ఆటలాడటం మొదలైనవి.

Previous Post Next Post